చెన్నై: తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అమర్ ప్రసాద్‌రెడ్డి బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కే అన్నామలై పార్టీ నుంచి తప్పుకొన్న దరిమిలా ఈ పరిణామం చోటుచేసుకుంది. తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన అమర్ ప్రసాద్ తాను ‘అన్నామలై’ భవిష్యత్ రాజకీయ ప్రయాణంలో భాగస్వామ్యం కానున్నట్లు తెలిపారు.
ఈ నెల ప్రారంభంలో బీజేపీ నుంచి అన్నామలై వైదొలగిన తర్వాత పార్టీ ఉపాధ్యక్షుడు కారు నాగరాజన్‌తో పాటు మరో 15 మంది పార్టీ నిర్వాహకులు తమ పదవులకు రాజీనామా చేశారు. ‘అన్నామలై’ నిష్క్రమణ వల్ల పార్టీపై ఎటువంటి ప్రభావం ఉండదని ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పష్టం చేసిన తరువాత కూడా రాజీనామాల పర్వం కొనసాగుతుండటం గమనార్హం.