తమిళనాడులో మరో వారం లాక్డౌన్ పొడగింపు
తమిళనాడులో మరో వారం లాక్డౌన్ పొడగింపు | తమిళనాడులో మరో వారం రోజుల పాటు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ ఈ నెల 7న ఉదయం 6 గంటతో ముగియనుంది.

చెన్నై : తమిళనాడులో మరో వారం రోజుల పాటు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ ఈ నెల 7న ఉదయం 6 గంటలతో ముగియనుంది. ప్రస్తుతం వైరస్ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో 14వ తేదీ ఉదయం 6 గంటల వరకు పొడగిస్తూ సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. వైరస్ వ్యాప్తి తక్కువ ఉన్న పలు జిల్లాలకు సడలింపులను ప్రకటించారు. షాపింగ్ కాంప్లెక్స్, మాల్స్, పర్యాటక ప్రదేశాలు, సినిమా థియేటర్, సెలూన్ షాపులు రాష్ట్రవ్యాప్తంగా మూసి ఉంచనున్నారు. కోయంబత్తూర్, నీలగిరి, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, కరూర్, నమక్కల్, తంజావూర్, తిరువారూర్, నాగపట్నం, మాయిలదుతూరై జిల్లాల్లో కరోనా కేసులు అధికంగా ఉండడంతో ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
11 జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా సడలింపులుంటాయని ప్రభుత్వం తెలిపింది. కిరాణ దుకాణాలు, చేపలు, మాంసం, కూరగాయలు, పండ్లు, పూల దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి 5 గంటల మధ్య తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 30 శాతం సిబ్బందితో పని చేయనున్నాయి. తక్కువ కేసులు నమోదవుతున్న జిల్లాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పని చేస్తాయని, టోకెన్లలో 50 శాతం మాత్రమే జారీ చేస్తారని చెప్పారు. అపార్ట్మెంట్ల కోసం ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు, హౌస్ కీపింగ్ సేవలను ఈ రిజిస్ట్రేషన్‌తో అనుమతి ఇవ్వనున్నట్లు చెప్పారు.
ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కంప్యూటర్, మోటారు టెక్నీషియన్లు, వడ్రండుగులు ఈ రిజిస్ట్రేషన్‌తో ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ వస్తువులు విక్రయించే దుకాణాలు, ద్విచక్ర వాహన వర్క్‌షాప్‌లు, హార్డ్‌వేర్ షాపులు, స్టేషనరీ దుకాణాలు, ట్రావెల్ ఆపరేటర్ల వాహన మరమ్మతు దుకాణాలు సాయంత్రం వరకు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే ఆటోలు, క్యాబ్‌లో ఇద్దరు ప్రయాణికులు ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు ఇంకా పలు సడలింపులు ఇచ్చింది. అయితే, కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
షుగర్ కంట్రోల్‌తో బ్లాక్ ఫంగస్‌కు చెక్
వ్యాక్సిన్ వేసుకున్న వారికి కరోనా వచ్చినా చనిపోలేదు: ఎయిమ్స్ అధ్యయనం
పార్టీ ప్రధాన కార్యదర్శులతో బీజేపీ చీఫ్ భేటీ
ట్రంప్ ఖాతాపై ఫేస్బుక్ రెండేళ్ల నిషేధం
రైతులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం
నేటి నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల స్థావరం పేల్చివేత
దేశంలో తగ్గుతున్న కరోనా.. 24 గంటల్లో 1.20లక్షల కేసులు
ప్రకృతితో మమేకమై జీవించాలి : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Good News : త్వరలో పిల్లలకు అందుబాటులోకి టీకా!
మళ్లీ పట్టాలెక్కిన ప్యాసింజర్ రైళ్లు
విషాదం.. న్యూబోయినపల్లిలో నాలాలో పడి బాలుడి గల్లంతు
‘ధరణి’ సమస్యలపై ఇక ఫిర్యాదులను వాట్సాప్, మెయిల్ చేయొచ్చు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

