Suspension | సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు నాయబ్ తహశీల్దార్ శ్రీధర్ నాయక్‌పై సస్పెన్షన్ వేటుపడింది. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా అక్రమంగా పౌతి (సక్సెషన్) నమోదు చేసినందుకు గానూ ఆయన్ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఉత్తర్వులు జారీ చేశారు.
విధుల నిర్వహణలో అక్రమాలకు పాల్పడుతూ.. కుటుంబసభ్యుల అనుమతి లేకుండా ఫౌతీ నమోదు చేశారని శ్రీధర్ నాయక్‌పై ఇటీవల ఆరోపణలు వచ్చాయి. వాటిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. ఆరోపణలు నిజమేనని నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే శ్రీధర్ నాయక్‌పై చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వు్ల్లో కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.