ఆమనగల్లు, జూలై 30 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రతి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు వేస్తామాని ప్రకటించి అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్న ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకుండా కాలయాపన చేస్తూ నిరుద్యోగులను మోసం చేస్తుందని బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా నాయకుడు సురిగిమల్ల శేఖర్ అన్నారు. ఆమనగల్లు పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సురిగిమల్ల శేఖర్ మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఇచ్చిన హామి మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్లు తప్పా, కొత్తగా ఒక్క నోటిఫికేషన్ వేసిన ధాఖలాలు లేవని ఆయన పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధించిన వారికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామాకపత్రాలు ఇచ్చి మా ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. 19 నెలలుగా నోటిఫికేషన్ వస్తుందని నిరుద్యోగులు రాత్రి, పగలు తేడా లేకుండా 24 గంటలు చదువుతూ తీరా నోటిఫికేషన్ రాకపోవడంతో తీవ్ర నిరాశ, నిసృహలకు లోనవుతున్నారాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో అశోక్ నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగుల ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలన్ని భర్తి చేస్తామాని చెప్పి అధికారంలోకి వచ్చాన ఆ విషయం మర్చిపోయారన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, లేని పక్షంలో నిరుద్యోగలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని ఆయన నిరుద్యోగులకు సూచించారు.