Supreme Court | దేశంలో రహదారి భద్రత సమస్యలపై దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషనర్ కోరిన ఉపశమనాలు న్యాయపరంగా ఒకే పిటిషన్లో పరిష్కరించలేమని పేర్కొంది. పిటిషనర్ లేవనెత్తిన చాలా అంశాలు తమిళనాడుకు చెందినవేనని, పిటిషన్ ఉపశమనం కోసం ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించవచ్చని జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ సుధాన్షు ధూలియా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. తమిళనాడుకు చెందిన ఓ పిటిషనర్ రహదారి భద్రతపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశంలోని ప్రతి సంవత్సరం ఐదులక్షలకుపైగా ప్రమాదాలు జరుగుతున్నాయని బెంచ్‌కు తెలిపారు.
రోడ్డు ప్రమాద కేసుల్లో ఒకే చోట చికిత్స పొందలేమని పిటిషనర్ చెప్పగా.. ప్రమాద కేసులను సమన్వయంతో క్రమబద్ధీకరిస్తున్నట్లు ధర్మాసనం గమనించింది. అన్ని అక్రమ నిర్మాణాలను తొలగించాలని రాష్ట్రానికి ఆదేశాలతో కూడిన పిటిషన్లో కోరిన ఉపశమనాల గురించి బెంచ్.. మీకు మంచి ఉద్దేశ్యం ఉండవచ్చని.. కానీ, అవి న్యాయపరంగా ఒక పిటిషన్ పరిష్కరించలేదని విధంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. పిటిషన్‌ను విచారణకు నిరాకరిస్తూ.. తమిళనాడు హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషన్‌కు స్వేచ్ఛను కల్పించింది.