న్యూఢిల్లీ: మద్యం కొనుగోలుదారుల వయసు నిర్ధారణకు పటిష్ట విధానాన్ని అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించింది. ‘కమ్యూనిటీ ఎగెనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్’ అనే సంస్థ ఈ పిటిషన్ను దాఖలు చేసింది. మద్యం విక్రయ కేంద్రాల వద్ద కొనుగోలుదారుల వయసును కచ్చితంగా నిర్ధారించిన తర్వాతే మద్యాన్ని విక్రయించే విధంగా పటిష్ట విధానాన్ని రూపొందించి, అమలు చేయాలని కోరింది. నిర్దిష్ట వయసు కన్నా తక్కువ వయసు గలవారు మద్యం సేవించడం, మద్యాన్ని కలిగి ఉండటం చట్ట విరుద్ధమని పేర్కొంది.