AP News | న్యూఢిల్లీ, నవంబర్ 12: తన మెదడును కొందరు మెషీన్ ద్వారా నియంత్రిస్తున్నారని, అది పనిచేయకుండా చైతన్యరహితం చేయాలంటూ ఆదేశాలు ఇవ్వాలంటూ ఒక ఉపాధ్యాయుడు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. కొందరు వ్యక్తులు హైదరాబాద్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైంటిఫిక్ ల్యాబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) నుంచి తీసుకున్న ‘మనిషి మెదడును చదివే పరికరం’ను కొనుగోలు చేసి దాని ద్వారా తన మెదడును నియంత్రిస్తున్నారని ఏపీకి చెందిన ఉపాధ్యాయుడొకరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
దానిని సుప్రీం కోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ (ఎస్సీఎల్ఎస్సీ)కి దానిని పంపారు. దీంతో పిటిషన్దారుడి నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్న కమిటీ అతడి మెదడును ఎవరూ యంత్రపరికరం ద్వారా నియంత్రణ చేయడం లేదని నివేదిక ఇవ్వడంతో సుప్రీం కోర్టు అతడి పిటిషన్ను కొట్టివేసింది. కాగా, పిటిషనర్ ఇదే అంశంపై ఏపీ హైకోర్టును ఆశ్రయించగా, 2022లో దానిని అసం బద్ధంగా పేర్కొంటూ కొట్టివేశారు.