పెబ్బేరు, ఫిబ్రవరి 3 : కేసీఆర్ హయాంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులకు ఆయన మంగళవారం పెబ్బేరులో బీఫాంలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో కోట్లాది రూపాయల వ్యయంతో పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు గుర్తుచేశారు. విద్యార్థి లోకానికి బీఆర్ఎస్ అండగా ఉందని చెప్పేందుకు 4వ వార్డు నుంచి ఎంబీబీఎస్ విద్యార్థిని పవిత్రను నిలబెట్టినట్టు వెల్లడించారు.