ములుగు, జనవరి 3 (నమస్తే తెలంగాణ): మేడారం జాతరలో బాలికపై రేప్ జరిగినట్టు మీడియా తోపాటు సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదంటూ బాలిక సోదరుడు మంగళవారం ఓ వీడియో ద్వారా వెల్లడించాడు. మేడారంలో డాబర్ పేస్ట్ ఉచిత పంపిణీ కేంద్రం వద్ద చిన్న దొంగతనం జరుగగా, చోరీకి పాల్పడిన యువతిని పట్టుకొని కొందరు కొట్టారని పేర్కొన్నారు.
అక్కడే ఉన్న తన సోదరితోపాటు వదిన ఏం జరుగుతుందోనని చూస్తున్న క్రమంలో చోరీకి పాల్పడిన యువతి సంబంధీకులు అనుకొని కొట్టారని తెలిపారు.