న్యూఢిల్లీ: సూర్య గోళం భీకరంగా మండుతోంది. గత కొన్ని రోజుల నుంచి సౌర తుఫాన్లు(Solar Storms) రిలీజ్ అయ్యాయి. భూమిపై సాధారణ జనజీవనాన్ని స్తంభింపచేసే రీతిలో సౌర తుఫాన్లు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మే 2వ తేదీన తొలిసారి సోలార్ స్టార్మ్ వచ్చినట్లు తెలుస్తోంది. దీన్ని ఎక్స్-క్లాస్ కేటగిరీ తుఫాన్‌గా భావిస్తున్నారు. సౌర తుఫాన్లలో ఇది అత్యంత శక్తివంతమైంది. ఆ సౌర తుఫాన్ వల్ల ఆస్ట్రేలియా, జపాన్, చైనా దేశాల్లో రేడియో షార్ట్వేవ్ బ్లాకౌట్ అయ్యింది. సూర్యుడిలోని AR3663 ప్రాంతంలో భారీ స్థాయిలో తుఫాన్ లేచినట్లు సౌరశాస్త్రవేత్త కీత్ స్ట్రాంగ్ తెలిపారు. మళ్లీ మే 3వ తేదీన రెండోసారి కూడా సౌర తుఫాన్లు వచ్చాయి. దాన్ని ఎం-క్లాస్ తుఫాన్‌గా అంచనా వేశారు.