రుద్రంపూర్, ఏప్రిల్ 28 : విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం శాలెం రాజు అన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టు భావన పెంపొందించేందుకు కోచింగ్ క్యాంప్‌లు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో ఉద్యోగుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ మంగళవారం రుద్రంపూర్‌లోని సీఈఆర్ క్లబ్లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లో భాగంగా ఫుట్‌బాల్, వాలీబాల్, కిక్ బాక్సింగ్ మరియు అథ్లెటిక్స్ విభాగాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 18 సంవత్సరాల లోపు బాలురు, బాలికలు ఈ క్యాంప్‌లో పాల్గొని శిక్షణ పొందనున్నారు.
వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా పిల్లలలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడం, శారీరక దృఢత్వం మరియు క్రమశిక్షణను అభివృద్ధి చేయడం ఈ క్యాంప్ ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంఓఏ అధ్యక్షుడు నరసింహారావు, ఏజీఎం (పర్సనల్) జి.వి. మోహన్‌రావు, ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ రాములు, ఐఎన్టీయూసీ ట్రెజరర్ భీముడు, సీనియర్ పిఓ మురళి, కోఆర్డినేటర్ సాగర్, బి. వెంకటేశ్వర్లు, అధికారులు, పిల్లలు పాల్గొన్నారు.

సింగరేణి ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభం