RR vs PBKS : పంతొమ్మిదో సీజన్లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు వేళైంది. ఓటమన్నదే ఎరుగని పంజాబ్ కింగ్స్ (Punjab Kings)ను రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ఢీకొడుతోంది. అజేయంగా దూసుకెళ్తున్న పంజాబ్‌కు తొలి ఓటమి రుచి చూపించి ఆరో విజయం నమోదు చేయాలని రాజస్థాన్ పట్టుదలతో ఉంది. ముల్లన్పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రియాన్ పరాగ్ బౌలింగ్ తీసుకున్నాడు.
గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 265 పరుగులను ఉఫ్‌మనిపించింది పంజాబ్. ఓపెనర్లు ప్రియాన్ష్, ప్రభ్‌సిమ్రన్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మెరుపులతో ఢిల్లీకి షాకిచ్చిన పంజాబ్ ఈసారి రాజస్థాన్ రాయల్స్‌కు తమ పవర్ చూపించాలనుకుంటోంది.
🚨Toss update from New Chandigarh🚨@rajasthanroyals won the toss and elected to bowl first against @PunjabKingsIPL
Updates ▶️ https://t.co/fBbdVnF5Fx#TATAIPL | #KhelBindaas | #PBKSvRR pic.twitter.com/B0CBFCjVhr
— IndianPremierLeague (@IPL) April 28, 2026
గత మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ సెంచరీ బాదినా రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు. ప్లే ఆఫ్స్ రేసు ఉత్కంఠ రేపుతున్న వేళ విజయంతో ముందంజ వేయాలని పరాగ్ సేన భావిస్తోంది. ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు రెండు మార్పులు చేశాయి. రాజస్థాన్ జట్టులో శనక, యశ్ రాజ్ పూనియా రాగా.. పంజాబ్ తుది జట్టులో సూర్యాన్ష్ శెడ్గే, లాకీ ఫెర్గూసన్ ఆడుతున్నారు.
పంజాబ్ తుది జట్టు : ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), కూపర్ కొన్నొల్లీ, సూర్యా్న్ష్ షెడ్గే, నేహల్ వధేరా, స్టోయినిస్, మార్కో యాన్సెన్, ఫెర్గూసన్, అర్ష్‌దీప్, చాహల్.
ఇంప్యాక్ట్ సబ్స్ – విష్ణు వినోద్, విజయ్‌కుమార్, బార్ట్లెట్, హర్‌ప్రీత్ బ్రార్, ముషీర్ ఖాన్.
రాజస్థాన్ తుది జట్టు : వైభవ్ సూర్యవంశీ, యశస్వీ జైస్వాల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), ఫెరీరా, జడేజా, శనక, ఆర్చర్, బర్గర్, బ్రిజేశ్ శర్మ, యశ్ రాజ్ పూనియా.
ఇంప్యాక్ట్ సబ్స్ – రవి బిష్ణోయ్, రవి సింగ్, తుషార్ దేశ్‌పాండే, శుభం దూబే, హిట్మైర్.