సింగరేణి ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభం
విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం శాలెం రాజు అన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టు భావన పెంపొందించేందుకు కోచింగ్ క్యాంప్‌లు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో..
రుద్రంపూర్, ఏప్రిల్ 28 : విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం శాలెం రాజు అన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టు భావన పెంపొందించేందుకు కోచింగ్ క్యాంప్‌లు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో ఉద్యోగుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ మంగళవారం రుద్రంపూర్‌లోని సీఈఆర్ క్లబ్లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లో భాగంగా ఫుట్‌బాల్, వాలీబాల్, కిక్ బాక్సింగ్ మరియు అథ్లెటిక్స్ విభాగాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 18 సంవత్సరాల లోపు బాలురు, బాలికలు ఈ క్యాంప్‌లో పాల్గొని శిక్షణ పొందనున్నారు.
వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా పిల్లలలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడం, శారీరక దృఢత్వం మరియు క్రమశిక్షణను అభివృద్ధి చేయడం ఈ క్యాంప్ ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంఓఏ అధ్యక్షుడు నరసింహారావు, ఏజీఎం (పర్సనల్) జి.వి. మోహన్‌రావు, ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ రాములు, ఐఎన్టీయూసీ ట్రెజరర్ భీముడు, సీనియర్ పిఓ మురళి, కోఆర్డినేటర్ సాగర్, బి. వెంకటేశ్వర్లు, అధికారులు, పిల్లలు పాల్గొన్నారు.

సింగరేణి ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభం
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders Attack | ఫేస్బుక్ మెటా ఆఫీస్ పై కాంగ్రెస్ నాయకుల దాడి
Hyderabad | నీటి ట్యాంకు నుంచి వృథాగా పోతున్న తాగునీరు..
Enugula Rakesh Reddy | యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్ : ఏనుగుల రాకేష్‌రెడ్డి
Road Accident | ఆటో బోల్తా..ఐదుగురికి గాయాలు
Sensational Comments | రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు.. సోనియాగాంధీకి సీనియర్ నాయకుడు లేఖ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

