మెదక్ : జిల్లాలో సరిపడ పెట్రోల్( Petrol ) , డీజిల్ ( Diesel ) నిల్వలు ఉన్నాయని ఆర్డీవో రమాదేవి ( RDO Ramadevi ) తెలిపారు. మంగళవారం పట్టణంలోని శ్రీనివాస పెట్రోల్ పంపును తహసీల్దార్ లక్ష్మణ్ బాబుతో పరిశీలించారు. ప్రస్తుతం పంపులో పెట్రోల్ నిల్వ 29,232 లీటర్లు , డీజిల్ నిల్వ : 26,667 లీటర్లు నిల్వ ఉన్నాయని వెల్లడించారు.
వినియోగదారులు ఆందోళన చెందవద్దని సూచించారు. రాజ్పల్లిలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. గన్ని సంచుల వివరాలు, తాగునీటి సౌకర్యం గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 1200 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని సిబ్బంది ఆమెకు వివరించారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు.