వ్యవసాయ యూనివర్సిటీ, సెప్టెంబర్ 27ః నియోజకవర్గ అభివృద్ధి పేర మాయమాటలు చెప్పి కాంగ్రెస్ నాయకులు తమను మోసం చేశారని, నిజం తెలుసుకుని స్వంత గూటి (బీఆర్ఎస్)లో చేరుతున్నామని రాజేంద్రనగర్ నియోజకవర్గం సులేమాన్ నగర్ డివిజన్ నాయకులు ఎండీ నయిమోద్దీన్ తదితరులు అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు.
సులేమాన్ నగర్, చింతల్ మెట్, ఇంద్రానగర్, ముస్లిం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ భవన్కు రాజేంద్రనగర్ బీఆర్ఎస్ నియెజకవర్గ ఇంచార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో చేరుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే సీసీ రోడ్లు, తాగునీరు, విద్యుత్ తదితర కనీస వసతులతో పాటు షాదీముబారక్, సీఎం కేసీఆర్ కిట్ల ద్వారా లబ్ది పొందామని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు తమ ప్రాంతాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మాయ మాటలకు మోసపోయి కాంగ్రెస్ పార్టీలో చేరామని, ప్రజల సమస్యలు తీసుకెళ్లి ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అటు స్థానిక ప్రజలు సైతం మంచి పార్టీని వీడి మీ స్వాలంబన చూసుకున్నారని తమను నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నియోజకవర్గ నాయకులు పి.కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎండీ నయిమోద్దీన్, ఎండీ హుస్సేన్, షేక్ బాబ, షేక్ అక్రమ్, సురేష్, రాజేష్, ఇబ్రహీం, ఫరూఖ్, జంపన్న, రజాక్, శ్రీనివాస్, సమీర్, అగ్భర్, రాములు, అన్సారి, షైనాజ్ మేడం, బాను మేడం, రఫత్ మేడం, షాహిన్ మేడం, మస్తాన, సమీరా, నజీర్, షకీలా మేడం, షభానా మేడం తదితరులు బీఆర్ఎస్లో చేరారు.