Suicide : ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ అసిస్టెంట్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నంగునూరు మండలం రాజగోపాల్ పేట గ్రామానికి చెందిన ఆకు బత్తిని పవన్ ఏడేళ్లుగా ప్రభుత్వ ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు.
ఏమైందో ఏమోగానీ ఆదివారం ఉదయం ఆస్పత్రిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణం అధికారుల వేధింపులా..? లేదంటే వ్యక్తిగత కారణాలా..? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.