మరికల్ : మతిస్థిమితం లేక ఒకరు ఆత్మహత్యకు ( Suicide ) పాల్పడిన ఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ మజీద్ ( ASI Majeed ) కథనం మేరకు.. మండలంలోని పల్లెగడ్డ గ్రామానికి చెందిన కాటకొండ రాములు (47)కు కొన్ని రోజులుగా మతిస్థిమితం లేదని తెలిపారు.
ఆదివారం తన వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉండగా గ్రామస్థులు గమనించి హుటాహుటినా మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఎస్సై తెలిపారు. భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ,ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.