తాండూర్ : ఝాన్సీ లక్ష్మీబాయి ( Jhansi Lakshmibai) ని విద్యార్థులుఆదర్శంగా తీసుకోవాలని మండల అభివృద్ధి అధికారి పీ శ్రీనివాస్ ( MPDO Srinivas
), మండల విద్యాధికారి ఎస్ మల్లేశం కోరారు. ఝాన్సీ లక్ష్మీబాయి 197వ జయంతి సందర్భం గా నారీ యువశక్తి ఫోరం ప్రధాన కార్యదర్శి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవంలో వారు మాట్లాడారు.
విద్యార్థులు ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్రను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యం వైపు అడుగులు వేయాలని సూచించారు. ఈ సందర్భంగా జడ్పీహెచ్ఎస్ తంగళ్ళపల్లి పాఠశాలలో హై స్కూల్ విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
‘డిజిటల్ యుగంలో మహిళ రక్షణ ’అనే ఉపన్యాసం అంశంలో ప్రథమ బహుమతి పొందిన సీహెచ్ అంజనశ్రీ , ద్వితీయ బహుమతి ఫర్హాన, తృతీయ బహుమతి బి సంజన పొందారు. ‘ఆధునిక భారతదేశంలో మహిళల పాత్ర ’ అనే వ్యాసరచన అంశంలో ప్రథమ బహుమతి
తేజస్విని , ద్వితీయ బహుమతి సిహెచ్ గురుప్రియ , తృతీయ బహుమతి బి శ్రీజ గెలుపొందారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సుష్మ, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఎస్వో కవిత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సూరం రవీందర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు చిలువేరు శేషగిరి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎల్క రాంచందర్, ఉపాధ్యాయులు జి ప్రకాష్, జి మీనా, పి స్వప్న, అశోక్, సాంబమూర్తి, శ్రీకాంత్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.