హనుమకొండ చౌరస్తా, జులై 3: కాకతీయ యూనివర్సిటీ భూముల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించొద్దని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. విద్యార్థి సంఘాల నాయకులు రిజిస్ట్రార్ ఛాంబర్ లో బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో వారని కేయూ పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
కాగా, ఇటీవల కేయూ భూములను ఇంటెగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు కేటాయించే విధంగా కేయూ పాలకవర్గం నిర్ణయం తీసుకోవడాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ పాలకవర్గం సభ్యులు స్కూల్ కి కేటాయించిన 15 ఎకరాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి డిమాండ్ చేశారు. ఖబర్దార్ స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. కేయూ వీసీ, ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్వీ నాయకులు భైరపాక ప్రశాంత్, జెట్టి రాజేందర్, పీడీఎస్యూ నాయకులు శ్రవణ్, మహేష్, ఏఐఎఫ్డిఎస్ నాయకులు నాగార్జున, సావిత్రి, బీఎస్ఏ శ్రవణ్, గణేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు సాయికుమార్, స్వేరోస్ స్టూడెంట్ యూనియన్ నాయకుడు సాయికుమార్, ఏడిఎస్ ఓ మధు, ధర్మ స్టూడెంట్ యూనియన్ నాయకులు అన్నమయ్య అరెస్ట్ ఉన్నారు.