సంగారెడ్డి : జిల్లాలో శాంతిభద్రతలకు ( Law and Order ) విఘాతం కలిగించే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరితోష్ పంకజ్ ( SP Paritosh Pankaj ) హెచ్చరించారు. రెండు వర్గాల మధ్య గాని, కుల, మతాల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ( Provocative Comments ) వాఖ్యలు చేసినా, పోస్ట్లు పెట్టినా చట్టరీత్యా చర్యలు తప్పవని అన్నారు.
శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. జిల్లాలో ప్రజలకు పోలీసు యంత్రాంగం సేవలు అందుబాటులో ఉంటాయని, అసాంఘిక శక్తులకు తావు లేకుండా పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎంతటి వారైనా చట్టాలకు అతీతులు కారని గుర్తుచేశారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టినా, ఫార్వర్డ్ మెసేజ్లు పంపినా ఉపేక్షించేదన్నారు. అటువంటి చర్యలు తీసుకుని హిస్గరీ షీట్లు ఓపెన్ చేస్తామని స్పష్టం చేశారు.