LSG vs MI : స్వల్ప ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) మార్కస్ స్టోయినిస్(52) ఆల్‌రౌండర్ చెలరేగాడు. ముంబై బౌలర్లను ఉతికేస్తూ హాఫ్ సెంచరీ బాదాడు. 39 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అర్ద శతకం సాధించాడు. దాంతో, లక్నో విజయానికి మరింత చేరువైంది.
ఒక్క పరుగుకే వికెట్ పడిన వేళ క్రీజులోకి వచ్చిన స్టోయినిస్ కెప్టెన్ కేఎల్ రాహుల్(28), హుడా(18)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ప్రస్తుతం నికోలస్ పూరన్(1) అండగా జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నాడు. 14 ఓవర్లకు లక్నో స్కోర్.. 103/3. లక్నో విజయానికి ఇంకా 42 రన్స్ కావాలంతే.