IPL 2024 : టీ20 వరల్డ్ కప్ వామప్ మ్యాచ్‌లకు ఇంకా వారం రోజులే ఉంది. ఈ మెగా టోర్నీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అన్ని జట్లు విజయంతో టోర్నీని ఆరంభించాలనే పట్టుదలతో ఉన్నాయి. అయితే.. టీ20 జట్టుకు ఎంపికైన కొందరు ఆటగాళ్లు ఐపీఎల్ కోసం భారత్‌లోనే ఉండనున్నారు. ఇప్పటికే విండీస్ బోర్డు తమ క్రికెటర్లను సఫారీ సిరీస్‌కు పక్కనపెట్టేసింది. తాజాగా ఆస్ట్రేలియా బోర్డు సైతం ఐపీఎల్ ‘ప్లే ఆఫ్స్’ ఆడేందుకు తమ జట్టు ప్లేయర్స్‌కు అనుమతించింది.
ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్‌లు ఆడే ఆసీస్ క్రికెటర్లు పొట్టి ప్రపంచకప్ వామప్ మ్యాచ్‌లకు దూరం కానున్నారు అని హెడ్‌కోచ్ మెక్‌డొనాల్డ్ తెలిపాడు. దాంతో, కంగారూ జట్ట హెడ్‌కోచ్ పెద్దమనసు అభిమానులు హ్యాట్సాఫ్ చెప్తున్నారు. మరోవైపు ప్లే ఆఫ్స్ వరకు తమ ఆటగాళ్లు భారత్‌లోనే ఉంటారని మాటిచ్చి తప్పిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డును కొందరు తెగ తిట్టిపోస్తున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి కమిన్స్

పొట్టి ప్రపంచకప్ టోర్నీకి ఎంపికైన ఆసీస్ స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్‌తో బిజీగా ఉన్నారు. మాజీ సారథి ప్యాట్ కమిన్స్ (Pat Cummins), ఓపెనర్ ట్రావిస్ హెడ్, ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, పేసర్ మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్(Cameron Green)లు ప్లే ఆఫ్స్ ముగిశాక వరల్డ్ కప్ విమానం ఎక్కనున్నారు. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ 1న వరల్డ్ కప్ ఆరంభం కానుంది. అంతకంటే ముందు వామప్ మ్యాచుల్లో భాగంగా మే 30న వెస్టిండీస్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది.