Indian 2 | ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ఫిలింస్‌లో ఇండియన్ 2 ఒకటి. విశ్వనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో శంకర్ దర్శకత్వంలో 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు ఇది సీక్వెల్‌గా వస్తోంది. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 12వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన సినిమా యూనిట్.. తాజాగా ఫస్ట్ సింగిల్ ప్రోమోను కూడా వదిలింది. ఈ మేరకు లైకా ప్రొడక్షన్స్ ఒక ట్వీట్ చేసింది.
ఒక భారతీయుడు తన ధైర్యం, పరాక్రమంతో అవినీతిపరులను అంతమొందించేందుకు ఎలా ముందుకు సాగాడు అంటూ దీనికి ట్యాగ్ కూడా చేశారు. శూరా అంటూ సాగిన ఈ బీట్‌కు అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. ఈ ఫాస్ట్ బీట్‌లో కమల్ హాసన్ గుర్రంపై వెళ్తున్నట్లుగా చూపించారు. ఆయన మొహం సరిగ్గా కనిపించలేదు. కానీ ఈ ప్రొమో మ్యూజిక్ మాత్రం గూస్బంప్స్ తెప్పిస్తున్నది. దీనికి సంబంధించిన ఫుల్ సాంగ్‌ను రేపు.. అంటే మే 22వ తేదీన సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
An Indian rides forth with courage & valor! 🔥 Here’s a promo of the 1st single #SOURAA from BHARATEEYUDU-2. 🇮🇳 Full song is dropping Tomorrow at 5️⃣ PM. 🤩🥁
Rockstar @anirudhofficial musical 🎹
Lyrics #SuddalaAshokTeja ✍🏻
Vocals @anirudhofficial #ShruthikaSamudhrala 🎙️… pic.twitter.com/XoPg9bPo0q— Lyca Productions (@LycaProductions) May 21, 2024