Ranganath | తన గన్మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఈ విషయాన్ని సంచలనం చేయవద్దని కోరారు. ఎల్బీనగర్ కామినేనిలో చికిత్స పొందుతున్న కృష్ణ చైతన్యను ఇవాళ ఉదయం కలిశానని తెలిపారు. కృష్ణ చైతన్య బతికే ఉన్నాడని.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. సర్జరీ జరుగుతోందని.. బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.
దాదాపు రెండేండ్ల క్రితం బెట్టింగ్ యాప్లు/గేమింగ్ యాప్లో ఆడి డబ్బులు పోగొట్టుకోవడంతో కృష్ణ చైతన్య ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడని రంగనాథ్ తెలిపారు. అప్పుల కారణంగా అతని జీతంలో ఎక్కువ భాగం కట్ అవుతోందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అతను ఆత్మహత్యకు ప్రయత్నించాడని చెప్పారు. కృష్ణ చైతన్య ముందు నుంచి నాడీ సంబంధిత సమస్యలతోనూ బాధపడుతున్నాడని తెలిపారు. దాదాపు మూడు నెలల క్రితం చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడని.. అప్పుడు హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారని తెలిపారు. అయితే.. విధుల్లో మాత్రం అతను బాగానే ఉంటాడని స్పష్టం చేశారు.
ఆర్థిక ఇబ్బందుల