ముంబై, ఫిబ్రవరి 3: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్‌పడింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ యుద్ధానికి తెరలేపడంతో అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారిగా కుదుపునకు లోనయ్యాయి. దీంతో వరుసగా ఐదు రోజులుగా లాభపడుతున్న సూచీలు భారీగా నష్టపోయాయి. ఇంట్రాడేలో 700 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 319.22 పాయింట్ల నష్టంతో 77,186.74 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ సైతం 121.10 పాయింట్లు కోల్పోయి 23,361.05 వద్ద స్థిరపడింది.
దీంతో మదుపరులు లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.4,29,823.69 కోట్లు కోల్పోయి రూ.4,19,54,829.60 కోట్లు(4.82 ట్రిలియన్ డాలర్లు)కు పడిపోయింది. ఎల్అండ్టీ, టాటా మోటర్స్, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, రిలయన్స్ షేర్లు అత్యధికంగా నష్టపోగా..బజాజ్ ఫైనాన్స్ 5 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్, మారుతి షేర్లు కూడా లాభాల్లో ముగిశాయి.