మహబూబ్‌నగర్ : బీఆర్ఎస్ నాయకుల ( BRS Leaders ) పై నమోదైన కేసులపై స్టేషన్ బెయిల్ (
Station bail ) మంజూరయింది. సోషల్ మీడియా సభ్యులు వర్ధ భాస్కర్‌పై పోలీసుల వేధింపులను నిరసిస్తూ మహబూబ్ నగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట నిర్వహించిన నిరసనలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud) , రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు రవి సాగర్, పల్లె రవి, ఆంజనేయులు గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిషోర్ తదితరులపై కేసులు నమోదయ్యాయి. సోమవారం కేసులో భాగంగా రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో హాజరైన నాయకులకు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు.