నిజామాబాద్ : ప్రధాని మోదీ అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. మోదీకి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. నిన్న పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటు పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు.
భారీ ఎత్తున మోదీకి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. మోదీ దిష్టి బొమ్మలకు శవయాత్రలు నిర్వహించి దహనం చేశారు. వెంటనే ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీ తన తీరు మార్చుకోకుంటే గ్రామాల్లో తిరగనివ్వమన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్రంలోని బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో..

మహబూబాబాద్ జిల్లాలో..

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో..

సంగారెడ్డి జిల్లాలో..

నల్లగొండ జిల్లాలో..

జగిత్యాల జిల్లాలో..

కరీంనగర్ జిల్లాలో..


పెద్దపల్లి జిల్లాలో..



సూర్యాపేట జిల్లాలో..


జనగామ జిల్లాలో..


వరంగల్ జిల్లాలో..


నాగర్కర్నూల్ జిల్లాలో..

సిద్దిపేట జిల్లాలో..



హనుమకొండ జిల్లాలో..
