మహబూబ్‌నగర్ అర్బన్, ఫిబ్రవరి 8 : మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ విధ్వంసమేనని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ఆదివారం మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పధిలోని పలు డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్నర్ సమావేశాల్లో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ‘అర్ధరాత్రి అంధుల ఇండ్లను కూలగొడితే అక్కడికి వెళ్లి వారి పక్షాన పోరాడాం.
అదేదో నేరమైనట్టు మా నాయకులపై కేసులు పెట్టారు. అలాంటి వారు నేడు మళ్లీ ఓట్లు అడిగేందుకు వస్తున్నారు. వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పాలమూరులో మళ్లీ అభివృద్ధి పరుగులు పెట్టాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.