SL vs PAK : ఆసియా కప్ సూపర్ 4 మూడో మ్యాచ్‌లో శ్రీలంక(Srilanka), పాకిస్థాన్(Pakistan) తలపడుతున్నాయి. తొలి గేమ్‌లో ఓటమిపాలైన రెండు జట్లకు ఇది చావోరేవో మ్యాచ్. దాంతో విజయం లంక, పాక్ ఆటగాళ్లు సర్వశక్తులు ఒడ్డనున్నారు. అభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ సారథి సల్మాన్ అఘా బౌలింగ్ తీసుకున్నాడు.
కీలకమైన మ్యాచ్ కావడంతో లంక రెండు మార్పులతో ఆడుతుంది. స్పిన్నర్ థీక్షణ, పేసర్ కరుణరత్నే జట్టులోకి వచ్చారు. మరోవైపు గత మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసానికి చావుదెబ్బ తిన్న పాక్ అదే జట్టును కొనసాగించనుంది. ఇరుజట్లు సూపర్ 4లో ముందంజ వేయాలంటే గెలిచి తీరాల్సిందే.
👉 No changes for Pakistan in a huge game
👉 Wellalage and Mishara OUT for Sri Lanka – Karunaratne and Theekshana come in #PAKvSL LIVE ⏩ https://t.co/N8MULEjW3A pic.twitter.com/VFeud4Q4no— ESPNcricinfo (@ESPNcricinfo) September 23, 2025
శ్రీలంక తుది జట్టు : పథుమ్ నిశాంక, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), కుశాల్ పెరీరా, చరిత్ అసలంక(కెప్టెన్), దసున్ శనక, కమిందు మెండిస్, చమిక కరుణరత్నే, హసరంగ, థీక్షణ, చమీరా, నువాన్ తుషార.
పాకిస్థాన్ తుది జట్టు : సయీం ఆయూబ్, షహిబ్జద ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), హుస్నేన్ తలాట్, మొహమ్మద్ హ్యారిస్(వికెట్ కీపర్), నవాజ్, ఫహీం అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హ్యారిస్ రవుఫ్, అబ్రార్ అహ్మద్.
సూపర్ 4 తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో లంక చిత్తుగా ఓడింది. 168 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ సైఫ్ హసన్ (61), తౌహిద్ హృదయ్ (58)లు అర్ధ శతకాలతో విరుచుకుపడగా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. మరోవైపు పాక్‌ది మరీ దారుణమైన పరాజయం. లీగ్ దశలో టీమిండియా బౌలర్ల ధాటికి 128కే పరిమితమైన దాయది టీమ్‌కు.. సూపర్ 4లోనూ నిరాశే మిగిలింది. టాపార్డర్ సమిష్టిగా రాణించడంతో రన్స్ చేసినప్పటికీ.. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ(74) సుడిగాలి ఇన్నింగ్స్‌కు కుదేలైంది పాక్. పవర్ ప్లేలోనే గిల్, అభిషేక్ ద్వయం లక్ష్యాన్ని కరిగించగా.. తిలక్ వర్మ(30 నాటౌట్) లాంఛనం పూర్తి చేశాడు.