IND vs BAN : ఆసియా కప్ లీగ్ దశలో అదరగొట్టిన బంగ్లాదేశ్ (Bangladesh) సూపర్ -4లోనూ జూలు విదిల్చుతోంది. తొలి పోరులో శ్రీలంకకు షాకిచ్చిన బంగ్లా రెండో మ్యాచ్‌లో అజేయ భారత్‌కు చెక్ పెట్టాలనే పట్టుదలతో ఉంది. గత రికార్డులు టీమిండియా ఆధిపత్యాన్ని చాటుతున్నప్పటికీ.. కుర్రాళ్లు ఫామ్‌లో ఉండడంతో గెలుపుపై ధీమాతో ఉన్న బంగ్లాదేశ్‌కు సమస్య వచ్చి పడింది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా కెప్టెన్ లిటన్ దాస్ (Litton Das) గాయపడ్డాడు. దాంతో.. టీమిండియాతో బిగ్ మ్యాచ్‌లో అతడు ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి.
మంగళవారం కోచ్‌ల పర్యవేక్షణలో బంగ్లా జట్టు శిక్షణ శిబిరంలో పాల్గొంది. ఈ సందర్భంగా స్క్వేర్ కట్ ఆడబోయిన లిటన్ ఉన్నట్టుండి నడుంనొప్పితో విలవిలలాడాడు. దాంతో, ఫిజియో బేజుడ్ ఉల్ ఇస్లాం పరుగున వచ్చి లిటన్‌ను పరీక్షించాడు. అయినా నొప్పి తగ్గకపోవడంతో బంగ్లా సారథి నెట్స్ సెషన్ మధ్యలోనే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాడు.
Injury scare for Bangladesh ahead of India clash, captain Litton Das suffers back strain while batting in nets#INDvsBAN #AsiaCup2025 https://t.co/Gu3TaKkTu0
— Sports Tak (@sports_tak) September 23, 2025
‘ఈరోజు లిటన్ ని పరీక్షించాం. పైకి అయితే లిటన్ బాగానే కనిపిస్తున్నాడు. టీమిండియాతో సూపర్ 4 మ్యాచ్‌లో ఆడేందుకు సిద్ధంగానే ఉన్నాడు. కానీ, వైద్య పరీక్షల అనంతరం తుది నిర్ణయం తీసుకుంటాం’ అని బంగ్లా క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఒకవేళ రేపు లిటన్ ఫిట్‌గా లేకుంటే అతడి స్థానంలో మరొకరు జట్టును నడిపిస్తారు. అయితే.. వైస్ కెప్టెన్ లేకుండానే ఆసియా కప్ స్క్వాడ్‌ను వెల్లడించిన బీసీబీ ఎవరికి పగ్గాలు అప్పగిస్తుందో చూడాలి. సూపర్ 4 తొలి మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్ లంకను బంగ్లా మట్టికరిపించింది. 168 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ సైఫ్ హసన్ (61), తౌహిద్ హృదయ్ (58)లు అర్ధ శతకాలతో విరుచుకుపడగా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.