Dickie Bird : క్రికెట్‌ను ప్రాణంగా ప్రేమించి.. అంపైరింగ్ వృత్తిలో విశేషంగా రాణించిన డికీ బిర్డ్ (Dickie Bird) కన్నుమూశాడు. ఇంగ్లండ్‌కు చెందిన ఆయన మంగళవారం తుది శ్వాస విడిచాడు. తనదైన అంపైరింగ్‌తో అభిమానుల మనసులు చూరగొన్న డికీ వృద్ధాప్య సమస్యలతో 92 ఏళ్ల వయసులో మరణించాడు. ఆయన మృతి పట్ల యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్ సంతాపం తెలియజేసింది.
అంతర్జాతీయ మ్యాచులకు అంపైర్‌గా డికీ కెరీర్ చాలా గొప్పగా సాగింది. క్రికెట్ చరిత్రలో ముఖ్యంగా ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో చిరస్థాయిగా ఆయన పేరు నిలిచిపోతుంది అని యార్క్‌షైర్ క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది. యుక్తవయసులో క్రికెటర్‌గా కెరీర్ ప్రారంభించాడు డికీ. దేశవాళీలో యార్క్‌షైర్, లీసెస్టర్‌షైర్ జట్లు ఆడిన అతడు 93 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 3,314 రన్స్ కొట్టాడు. ఆ తర్వాత అంపైరింగ్ వైపు ఆకర్షితులయ్యాడు.
Everyone at the England & Wales Cricket Board is deeply saddened to hear of the passing of Dickie Bird.
A proud Yorkshireman and a much-loved umpire, he will be sorely missed.
Rest in peace, Dickie 🤍 pic.twitter.com/NHNF9y44Ms
— England Cricket (@englandcricket) September 23, 2025
1973లో అంపైర్‌గా కెరీర్ ప్రారంభించాడు డికీ. 20 సంవత్సరాలకు పైగా కొనసాగిన ఆయన మొదటి మూడు ప్రపంచ కప్ ఫైనల్స్‌కు అంపైరింగ్ చేశాడు. మొత్తంగా 66 టెస్టులు, 69 వన్డే మ్యాచ్‌లకు అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. తనదైన హాస్య చతురత, మైదానంలో హుందాతనంతో ఆటగాళ్లు, అభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించాడీ వెటరన్ అంపైర్. 1996లో వీడ్కోలు పలికిన డికీ చివరిసారిగా లార్డ్స్ టెస్టు భారత్, ఇంగ్లండ్ మ్యాచ్‌కు అంపైరింగ్ చేశాడు. ఇదే మ్యాచ్‌తోనే రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ టెస్టుల్లో అరంగేట్రం చేశారు.