హైదరాబాద్, అక్టోబర్ 15(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దకింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే ఆస్ట్రేలియా బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్(ఆస్ట్రేలియా బయోటెక్నాలజీ ఇండస్ట్రీ ఆర్గనైజేషన్)-2025లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది.
ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్ గీచీ బుధవారం సచివాలయంలో శ్రీధర్ బాబు ను కలిసి ఆహ్వానించారు. ఆస్ట్రేలియా బయోటెక్, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ సంయుక్తాధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 24 వరకు మెల్బోర్న్లో జరగనున్న ఈ సదస్సులో మంత్రి కీలకోపన్యాసం చేయనున్నారు.