ముంబై, అక్టోబర్ 15 : దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటర్.. దేశీయ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే ఐదేండ్లలో రూ.45 వేల కోట్ల పెట్టుబడితో ఉత్పత్తి, విక్రయాలను రెండింతలు పెంచుకోనున్నట్టు కంపెనీ ప్రెసిడెంట్, సీఈవో జోస్ మునోజ్ తెలిపారు. 2030 రోడ్‌మ్యాప్‌ను ఆయన బుధవారం విడుదల చేశారు. వచ్చే ఐదేండ్లలో దేశీయ మార్కెట్లోకి కొత్తగా 26 మాడళ్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.