BSNL Diwali Bonanza | దీపావళి పండుగకు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్ ప్రకటించింది. రూ.1కే కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీపావళి బొనాంజా పేరుతో దీన్ని లాంచ్ చేసింది.
దీపావళి సందర్భంగా తీసుకొచ్చిన ఈ ప్లాన్‌తో కేవలం ఒక్క రూపాయికే అపరిమిత సేవలను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా కస్టమర్లకు అన్లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 2జీబీ డేటాను బీఎస్ఎన్ఎల్ అందిస్తుంది. అలాగే రోజుకు 100 మెసేజ్‌లను పంపించుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ కొత్త వినియోగదారులకు మాత్రమే అని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. సిమ్ కూడా ఉచితంగా అందిస్తుంది. ఆసక్తి గల వినియోగదారులు ఈ ఆఫర్ కోసం సమీప బీఎస్ఎన్ఎల్ సర్వీస్ సెంటర్ లేదా రిటైలర్ను సందర్శించాలని సూచించింది. అలాగే ఈ ఆఫర్ అక్టోబర్ 15వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది.