Sri Chidambaram | కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన క చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఈ మూవీని నిర్మించిన శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా వినీషా రెడ్డి, చింతా గోపాల కృష్ణ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం శ్రీ చిదంబరం (Sri Chidambaram) . వినయ్ రత్నం దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీలో వంశీ తుమ్మల, సంధ్య వశిష్ఠ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
సోమవారం ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ వీడియోను యాక్టర్ కార్తికేయ లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. యూత్ అంతా కలిసి చేసిన తాజా ఫీల్ అందించే సినిమా ఇది. మెల్లకన్నుఉన్నయువకుడు అభద్రతాభావంతో కళ్లద్దాలు పెట్టుకుని లైఫ్ మేనేజ్ చేస్తుంటాడు. అలాంటి యువకుడు ప్రేమలో పడితే ఏం జరుగుతందనే ఫన్ డ్రామా నేపథ్యంలో సాగే సినిమా ఇదని.. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు సంతృప్తినిచ్చే సినిమా ఇదన్నారు.
ఈ చిత్రంలో కల్పలత గార్లపాటి, తులసి, కిట్టయ్య, గోపీనాథ్, శివకుమార్ మట్ట, అరుణ్ కుమార్, నాయుడు ఫణి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
శ్రీ చిదంబరం టైటిల్ గ్లింప్స్..
Be all ‘EYES’ & peep into the beautiful world of Chidambaram 🤩
Here’s the Title Glimpse of #SriChidambaram 🥳
– https://t.co/G29phIZU5QFrom @srichakraas – The Makers of Blockbuster #KA 💥
Written & Directed by @VinayRatnam_
Produced by #ChintaVineeshaReddy,… pic.twitter.com/4J5VzOhGWI
— Big Fish Media (@Team_BigFish) August 4, 2025
Kantara 3 | కాంతార 3లో జూనియర్ ఎన్టీఆర్… ఇదే నిజమైతే ఫ్యాన్స్‌కి పూనకాలే..!
Kamal Hassan | సనాతన బానిసత్వాన్ని అంతంచేసే ఆయుధం అదొక్కటే.. కమల్ హాసన్
Film Chamber | లేబర్ కమిషనర్‌ను కలవనున్న ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ సభ్యులు