Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Punjab | పంజాబ్ (Pujab) లో దారుణం జరిగింది. పటియాలా జిల్లా (Patiala district) లో ఓ కారు బీభత్సం సృష్టించింది. టోల్ ప్లాజా (Toll Plaza) వద్ద ఫీజు చెల్లించకుండా తప్పించుకునేందుకు వేగంగా దూసుకొచ్చి అడ్డుగా ఉన్న బ్యారియర్లను ఢీకొట్టింది. అక్కడ విధుల్లో ఉన్న ఓ ఉద్యోగిని ఢీకొట్టి, అతడిని కారు బానెట్‌పై కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది.
Punjab : పంజాబ్ (Pujab) లో దారుణం జరిగింది. పటియాలా జిల్లా (Patiala district) లో ఓ కారు బీభత్సం సృష్టించింది. టోల్ ప్లాజా (Toll Plaza) వద్ద ఫీజు చెల్లించకుండా తప్పించుకునేందుకు వేగంగా దూసుకొచ్చి అడ్డుగా ఉన్న బ్యారియర్లను ఢీకొట్టింది. అక్కడ విధుల్లో ఉన్న ఓ ఉద్యోగిని ఢీకొట్టి, అతడిని కారు బానెట్‌పై కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. పటియాలా-రాజ్‌పురా హైవేపై ఉన్న ధరేరి జట్టన్ టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజామున 3:58 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.
వేగంగా వచ్చిన ఓ తెలుపు రంగు కారు టోల్ ప్లాజా వద్ద ఆగకుండా బూమ్ బ్యారియర్‌ను బలంగా ఢీకొట్టింది. అదే సమయంలో అక్కడే ఉన్న ఉద్యోగి అమన్‌దీప్ సింగ్‌ను ఢీకొట్టడంతో అతను కారు బానెట్‌పై పడిపోయాడు. అయినప్పటికీ డ్రైవర్ కారును ఆపకుండా ముందుకు పోనివ్వడంతో బాధితుడు కొంత దూరం వరకు బానెట్‌పైనే ఉండిపోయాడు. ఆ తర్వాత కిందపడిపోయాడు. కారు డ్రైవర్ ఆగకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అమన్‌దీప్ సింగ్‌ను వెంటనే పటియాలాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతనికి తీవ్ర గాయాలైనప్పటికీ ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని, చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. అతను పటియాలా జిల్లా ఘుమానా గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారు రిజిస్ట్రేషన్ నంబర్‌ను గుర్తించారు.
కారులో డ్రైవర్ ఒక్కడే ఉన్నట్లు నిర్ధారించి అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై టోల్ ప్లాజా కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, రహదారుల దిగ్బంధం చేపడతామని హెచ్చరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- car
- Punjab
- Telugu News
- toll plaza
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
Anant Singh expelled | ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను.. పార్టీ నుంచి బహిష్కరించిన జేడీ(యూ)
పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

