పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం అందించాలని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. విద్యుత్ కోతల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నట్లు...
చందంపేట, అక్టోబర్ 24 : రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం అందించాలని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. విద్యుత్ కోతల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పీఏపల్లి మండలం అంగడిపేట సబ్‌స్టేషన్ వద్ద విద్యుత్ కోతలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు, రైతులు చేపట్టిన ముట్టడి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడంతో వలస వెళ్లిన అనేక మంది తిరిగి వచ్చి సాగు చేసుకున్నారని, ప్రస్తుతం విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోయి రైతులు మళ్లీ వలసలు వెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సుమారు 7,000 మెగావాట్ల స్థాయి నుంచి 20,000 మెగావాట్లకు పైగా పెంచామని, భద్రాద్రి, యాదాద్రి వంటి విద్యుత్ ప్రాజెక్టులను రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎందుకు ఏర్పడుతున్నాయి? బొగ్గు అందుబాటులో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి ఎందుకు జరగడం లేదు? అనే ప్రశ్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జూరాల పరిధిలో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ నల్లగొండ జిల్లా రైతులకు సాగునీరు అందకపోవడం బాధాకరమన్నారు. గ్రామాల్లో పశువులు, మేకలకు తాగునీరు అందని పరిస్థితులు నెలకొంటున్నాయని, కొన్ని గ్రామాల్లో ప్రజలు సైతం తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల సమస్యలపై నిర్లక్ష్యాన్ని వీడి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ కోతలను నివారించడం, సాగునీటి సదుపాయాలు కల్పించడం, కాలిపోయిన మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతు చేయడం, పంటలు నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించడం ద్వారా రైతులను ఆదుకోవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు వెల్లుగురి వల్లపు రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా, రెటీనేని ముత్యపు రావు, కటికనేని మాధవ రావు, సర్పంచులు కూన్‌రెడ్డి రాజశేఖర్ రెడ్డి, రైనబోయిన శ్రీను, ఆడెపు నగేష్, దూదిపాల రాజేందర్ రెడ్డి, రమావత్ కిషన్, హన్మ నాయక్, నాయకులు అర్వపల్లి నర్సింహ, తోటకూరి పరమేష్, బొడ్డుపల్లి మహేందర్, మద సుధాకర్ గౌడ్, వంగల కృష్ణా రెడ్డి, గోలి గిరి, ఎర్ర యాదగిరి, దేపావత్ నరేందర్, రమావత్ శ్రీను, నిమ్మ విష్ణువర్ధన్ రెడ్డి, లోకేష్, రమావత్ దామోదర్, గిరి,వెంకటేష్, అనిల్, శివ పాల్గొన్నారు.

పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

