Anant Singh expelled | ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను.. పార్టీ నుంచి బహిష్కరించిన జేడీ(యూ)
Anant Singh expelled | బీహార్ మాజీ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతా దళ్ (యునైటెడ్)కు చెందిన ఎమ్మెల్యే అనంత్ సింగ్‌పై ఆ పార్టీ చర్యలు చేపట్టింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆయనను ఆరేళ్ల పాటు జేడీ(యూ) నుంచి బహిష్కరించారు.
పాట్నా: బీహార్ మాజీ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతా దళ్ (యునైటెడ్)కు చెందిన ఎమ్మెల్యే అనంత్ సింగ్‌పై ఆ పార్టీ చర్యలు చేపట్టింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆయనను జేడీ(యూ) నుంచి బహిష్కరించారు. (Anant Singh expelled) మొకామా ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్, ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే నీలం దేవిలను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు. వారిద్దరి ప్రాథమిక సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. బీహార్ శాసన మండలి ఎన్నికలలో జేడీ(యూ) అభ్యర్థి నీరజ్ కుమార్‌కు వ్యతిరేకంగా అనంత్ కుమార్ సింగ్ ప్రచారం చేసిన నేపథ్యంలో ఆయనపై ఈ చర్య తీసుకున్నారు.
కాగా, పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించిన ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్, పాట్నా గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో జన్ సూరజ్ అభ్యర్థి అనుజ్ సింగ్‌కు మద్దతు తెలిపారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నీరజ్ కుమార్ తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఆయన ఆరోపించారు. ఆయనకు మద్దతు ఇవ్వాలన్న పార్టీ నిర్ణయాన్ని బహిరంగంగానే సవాల్ చేశారు.
అలాగే నితీశ్ కుమార్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన కోసం తాను తొమ్మిది హత్యలు చేసినట్లు అనంత్ సింగ్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మాట మార్చిన ఆయన, ఆ నెపాన్ని లాలూపైకి నెట్టారు. బీహార్‌లోని ఎనిమిది శాసనమండలి స్థానాలకు శుక్రవారం ఓటింగ్ జరిగింది. ఆ మరునాడే ఎమ్మెల్యే అనంత్ సింగ్, ఆయన భార్యను పార్టీ నుంచి జేడీ(యూ) బహిష్కరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anant Singh expelled | ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను.. పార్టీ నుంచి బహిష్కరించిన జేడీ(యూ)
పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

