Sonu Sood | కరోనా మహమ్మారి వేళ అభాగ్యులకు అండగా నిలిచి వార్తల్లో పతాక శీర్షికలకెక్కిన బాలీవుడ్ నటుడు సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వదంతులు మరోమారు విన వస్తున్నాయి.. ఎన్నికల్లో గెలుపొందిన రాజకీయ నాయకులు తమ మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానాలు అమలు చేయకపోతే వారు తమ పదవులకు రాజీనామా చేయాలని సోనూ సూద్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో ఆయన చేరనున్నారని, త్వరలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సోనూసూద్.. ఆప్ సీఎం అభ్యర్థిగా ఉంటారని ఆ వార్తలు సూచిస్తున్నాయి.
కానీ, ఇంతకుముందు సోనూసూద్ రాజకీయాల్లోకి రానని చెప్పేశారు. కానీ కొన్ని రోజుల క్రితం అరవింద్కేజ్రీవాల్.. పంజాబ్ ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్థి సిక్కు సామాజిక వర్గం నుంచి ఉంటారని ప్రకటించారు. ఇటీవలే సోనూసూద్.. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్‌ను కలుసుకున్నప్పటి నుంచి ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారన్న వార్తలు వస్తున్నాయి.
పంజాబ్‌లోని మొగా.. సోనూసూద్ స్వగ్రామం. ఆయన ముంబైలో ఉన్నా.. సోనూసూద్ కుటుంబం మొగాలో ఉంటున్నది. ఈ నేపథ్యంలో ప్రజలు, వారి పిల్లలకు మంచి ఉజ్వల భవిష్యత్ అందించాలంటే మంచి ఆలోచన గల వ్యక్తులు ముందుకు రావాలని సోనూసూద్ చెప్పడంతోనే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారన్న వదంతులకు బలం చేకూరుతున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Mukesh Ambani @ London | లండన్‌లోనూ ముకేశ్ అంబానీ ఇల్లు.. చూడ్డానికి రెండు కండ్లు చాలవేమో !
Petrol Price | దిగొస్తున్న ఇంధన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి..?
Stock market | స్టాక్ మార్కెట్ లో ముహూరత్ ట్రేడింగ్ కు ఎందుకు అంత ప్రాధ్యాన్యత ఇస్తారో తెలుసా..?
UAE power from waste | యూఏఈ సెన్సేషన్.. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తికి నిర్ణయం..!