
న్యూఢిల్లీ : కొవిడ్ రోగుల కోసం 30.86 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఓ)తో ఎక్స్‌ప్రెస్ ఒడిశా నుంచి ఢిల్లీకి బయలుదేరిందని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం తెలిపారు. కొవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఆక్సిజన్‌కు డిమాండ్ పెరగ్గా రైల్వేశాఖ వివిధ రాష్ట్రాలకు వైద్య ఆక్సిజన్‌ను అందించేందుకు ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. కరోనా రోగుల కోసం 30.86 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌తో ఒడిశాలోని అంగుల్ నుంచి ఢిల్లీకి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరిందని రైల్వేమంత్రి ట్వీట్లో పేర్కొన్నారు.
‘ఆక్సిజన్ ప్లాంట్ల నుంచి ఆక్సిజన్‌ను రాష్ట్రాలకు రవాణా చేయడం ద్వారా కరోనాకు వ్యతిరేకంగా మా సామూహిక పోరాటంలో రైల్వే కీలక పాత్ర పోషిస్తుంది’ అని పేర్కొన్నారు. ఏప్రిల్ 27న ఢిల్లీకి తొలిసారిగా ఎల్ఎంఓ మొదటిసారిగా సరఫరా అయ్యిందని, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిందాల్ స్టీల్ ప్లాంట్ నుంచి 64.55 టన్నుల ఎల్ఎంఓను తరలించినట్లు పేర్కొన్నారు. మరో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ నుంచి ఆరు ట్యాంకర్లలో 120 మెట్రిక్ టన్నుల ఎల్ఎంఓను ఢిల్లీకి తరలించనున్నట్లు తెలుస్తోంది.
#OxygenExpress to Delhi has departed from Angul, Odisha carrying 30.86 MT of oxygen for COVID-19 patients.
— Piyush Goyal (@PiyushGoyal) May 2, 2021
Railways is playing a crucial role in our collective fight against COVID-19 by transporting oxygen from oxygen plants to states across 🇮🇳 pic.twitter.com/pmkvPFAD7y