ఓదెల, ఆగస్ట్ 5 : పెద్దపెల్లి జిల్లాలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణమాసం సందర్భంగా శ్రీ భ్రమరాంబ అమ్మవారికి అర్చకులు భక్తులచే సామూహిక లలిత సహస్ర పారాయణ, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వీరభద్రయ్య మాట్లాడుతూ శ్రావణమాసంలో భక్తులు స్వామి వారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటారన్నారు.
ఈ రోజున భ్రమరాంబ అమ్మవారికి లలిత సహస్ర పారాయణ, కుంకుమార్చన కార్యక్రమాలు భక్తులచే ఘనంగా నిర్వహిస్తారని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో సదయ్య, అధికారులు తగు ఏర్పాట్లు చేశారు.