తాండూర్ : గణేష్ నవరాత్రులు (Ganesh Navratri celebrations) శాంతియుతంగా జరిగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవయ్య ( CI Devaiah ) తెలిపారు. తాండూర్ పోలీస్ స్టేషన్లో ఎస్సై డీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల ప్రారంభ నేపథ్యంలో ముందస్తుగా ముస్లిం సోదరులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులతో గురువారం శాంతి సమావేశాన్ని ( Peace Committee ) నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కుల, మత భేదం లేకుండా సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేపట్టే తనిఖీలకు సహకరించాలన్నారు. మండపాల నిర్వహణకు పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, విద్యుత్‌శాఖ ఏఈ జాన్, నాయకులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.