న్యూఢిల్లీ: స్పేస్ఎక్స్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. వికిపీడియా తరహాలో అంతకంటే మెరుగైన గ్రోకిపీడియా(Grokipedia)ను డెవలప్ చేస్తున్నట్లు తెలిపారు. ఆయన కంపెనీకి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ xAI ఆ కొత్త ఆన్లైన్ ఎన్సైక్లోపీడియాను డెవలప్ చేస్తున్నది. ఈ ప్లాట్‌ఫామ్‌కు గ్రోక్ టెక్నాలజీ వాడనున్నారు. మనుషులకు ఏఐ ఉపయోగపడే రీతిలో ఉండాలని ఎలన్ మస్క్ ఆశిస్తున్న తరహాలో కొత్త ఇన్సైక్లోపీడియా ఉంటుందని భావిస్తున్నారు. తన ఎక్స్ అకౌంట్లో ప్రకటిస్తూ.. గ్రోకిపీడియాను డెవలప్ చేస్తున్నట్లు చెప్పారు.
వికీపీడియా కంటే అతిభారీగా ఉంటుందన్నారు. విశ్వాన్ని అర్థం చేసుకునే లక్ష్యంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. వికీపీడియా కన్నా చాలా విశ్వసనీయమైన, పారదర్శకమైన, భిన్నమైన, కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో గ్రోకిపీడియాను తయారు చేస్తున్నట్లు మస్క్ తెలిపారు. మస్క్ ప్రకటనపై కొందరు ఆన్లైన్ యూజర్లు హర్షం వ్యక్తం చేయగా, కొందరు ఆ ప్రయత్నాన్ని తప్పుపట్టారు. గ్రోక్ ఎక్కువ శాతం వికిపీడియా డేటాను వాడుకుంటుందని, మరి గ్రోకిపీడియా ఎలా బెటర్‌గా ఉంటుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.
We are building Grokipedia @xAI.
Will be a massive improvement over Wikipedia.
Frankly, it is a necessary step towards the xAI goal of understanding the Universe. https://t.co/xvSeWkpALy
— Elon Musk (@elonmusk) September 30, 2025