South Africa | అబుదాబి: ఐర్లాండ్‌తో అబుదాబి వేదికగా జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా మరో మ్యాచ్ మిగిలుండగానే చేజిక్కించుకుంది. రెండో వన్డేలో సఫారీలు 174 పరుగుల తేడాతో గెలుపొందారు. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. ట్రిస్టన్ స్టబ్స్ (112) శతకంతో నిర్ణీత 50 ఓవర్లలో 343/4 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో ఐర్లాండ్ 30.3 ఓవర్లలోనే 169 పరుగులకు ఆలౌట్ అయింది.