లండన్: ఇంగ్లండ్ పర్యటనలో దక్షిణాఫ్రికా అదరగొడుతున్నది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా గురువారం ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా ఐదు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదుచేసి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్లో 2-0 ఆధిక్యం సాధించింది.
భారీ స్కోర్లు నమోదైన పోరులో మొదట బ్యాటింగ్ చేసిన సఫారీలు.. 50 ఓవర్లకు 330/8 పరుగుల భారీ స్కోరు చేశారు. బ్రీట్జ్ (85), స్టబ్స్ (58), మార్క్మ్ (49), బ్రెవిస్ (42) ఆ జట్టు భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఛేదనలో ఇంగ్లిష్ జట్టు.. 50 ఓవర్లలో 325/9 వద్దే ఆగిపోయింది. రూట్ (61), బట్లర్ (61), బెతెల్ (58) పోరాడినా ఆ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు.