Match Fixing : ఫ్రాంచైజీ క్రికెట్‌కు క్రేజ్ పెరగడంతో మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించేందుకు కొందరు బుకీలు ప్రయత్నిస్తున్నారు. తాజాగా యూపీ టీ20 లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ (Match Fixing) కలకలం రేపింది. కాశీ రుద్రాస్ ఫ్రాంచైజీ యజమాని అర్జున్ చౌహన్(Arjun Chauhan)కు ఒక బుకీ (Bookie) ఏకంగా భారీగా డబ్బులు ఆఫర్ చేశాడు. తాను చెప్పినట్టుగా చేస్తే రూ.1 కోటి ఇస్తానని ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. దాంతో.. సదరు బుకీపై అర్జున్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దాంతో, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
లక్నోకు చెందిన ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ @vipss_nakrani ఐడీతో ఆగస్టు 31న కాశీ రుద్రాస్ యజమాని అర్జున్ చౌహన్న్కు మెసేజ్ పంపాడు. తనను తాను బుకీగా పరిచయం చేసుకున్న అతడు మ్యాచ్ ఫిక్సింగ్ చేయాల్సిందిగా కోరాడు. తాను సూచించిన విధంగా జట్టులోని ఒక ఆటగాడు చేసేలా చూడాలని.. అలా చేసినందుకు రూ.1 కోటి ఇస్తానని అర్జున్‌కు చెప్పాడు. డబ్బులను యూఎస్ డాలర్ల రూపంలో ఆన్లైన్లో పంపిస్తానని అన్నాడు. దాంతో.. కాశీ రుద్రాస్ ఓనర్ అర్జున్ ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
BREAKING: Match-fixing allegations rock UP T20 League! Kashi Rudras team manager Arjun Chauhan receives ₹1 crore bribe offer from alleged bookie @vipss_nakrani‘ on Instagram. FIR registered, Lucknow Police investigating. #UP20League #MatchFixing pic.twitter.com/YTwoaNT7Ef
— Muhammad Yousaf (ANJUM) (@imyousafanjum) September 5, 2025