US Open : భారత టెన్నిస్ స్టార్ యుకీ బాంబ్రీ (Yuki Bhambri) కల చెదిరింది. యూఎస్ ఓపెన్ (US Open)లో సెమీఫైనల్ చేరి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై ఆశలు రేపిన అతడి పోరాటం ముగిసింది. ఫైనల్ బెర్తు కోసం జరిగిన పోరులో బ్రిట్స్ నీల్ స్కప్‌స్కీ – జో సలిస్బరీ (బ్రిటన్) జోడీ చేతిలో బాంబ్రీ – మైఖేల్ వీనస్ ద్వయం ఓటమి పాలైంది. గొప్పగా పోరాడినప్పటికీ ప్రత్యర్థిని నిలువరించలేక చరిత్రాత్మక పతకం చేజార్చుకుంది బాంబ్రీ జంట.
యూఎస్ ఓపెన్‌లో ఆది నుంచి అదరగొట్టిన యుకీ బాంబ్రీ.. తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటలో తడబడ్డాడు. పదకొండో సీడ్ నికొలా మెక్టిక్ – రాజీవ్ రామ్ జంటను ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లిన బాంబ్రీ – వీనస్ జోడీకి అనూహ్యంగా చుక్కెదురైంది. బ్రిట్స్ నీల్ స్కప్‌స్కీ – జో సలిస్బరీ ధాటికి చేతులెత్తేశారిద్దరూ. 2 గంటల 53 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో 7-6 (2), 6-7 (5), 4-6తో పరాజయం పాలైంది బాంబ్రీ జోడీ.
Yuki Bhambri’s best-ever Grand Slam campaign ended in the semifinals of the US Open 🏆
The 14th-seeded Indo-New Zealand pair of Bhambri and Michael Venus lost to the sixth seeds Joe Salisbury and Neal Skupski 7-6 (2), 6-7(5), 4-6 🎾
➡️ Read more: https://t.co/trDJc5gEnm pic.twitter.com/s7Zj1XERlz
— ESPN India (@ESPNIndia) September 5, 2025
‘ఈ వారం నాకు ఎంతో ప్రత్యేకం. గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీ ఫైనల్ ఆడడం అనేది గొప్ప క్షణం. అయితే.. ప్రత్యర్థిని నిలువరించలేకపోయాం. తొలిసారి ఇంత చేరువగా వచ్చి ఫైనల్ ఆడనందుకు బాధగా ఉంది. తదపరి టోర్నీల్లో మరింత మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాం’ అని బాంబ్రీ తెలపాడు. జూనియర్ స్థాయి(2009)లో వరల్డ్ నంబర్ 1 అయిన బాంబ్రీ.. ఓపెన్ ఎరాలో గ్రాండ్‌స్లామ్ సెమీ ఫైనల్ ఆడిన నాలుగో భారత డబుల్స్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. బాంబ్రీ కంటే ముందు దిగ్గజ ఆటగాళ్లు లియాండర్ పేస్, మహేశ్ భూపతి, రోహన్ బోపన్నలు ఈ ఘనత సాధించారు.