హైదరాబాద్: నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్‌లపై పోలీసులు కొరఢా ఝులిపిస్తున్నారు. కేపీహెచ్‌బీలోని మంజీరా మెజిస్టిక్ మాల్లో ఉన్న క్లబ్ మస్తీ పబ్‌పై (Club Masti pub) మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేయించడంతోపాటు పరిమితికి మించి డీజే సౌండ్‌తో పబ్ నడుపుతున్నట్లు గుర్తించారు. దీంతో తొమ్మిది మంది యువతులు, పబ్ మేనేజర్ ప్రదీప్ కుమార్, డీజే ఆపరేటర్ ధన్‌రాజ్, మరో వ్యక్తిని అరెస్టు చేశారు. పబ్ యజమాని శివప్రసాద్ రెడ్డి, మేనేజర్లు విష్ణు, కృష్ణ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. డీజే మిక్సర్, హుక్కా ఫ్లేవర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు.