Naveen Chandra | కన్నడ స్టార్ యాక్టర్ కిచ్చా సుదీప్ నటిస్తోన్న కన్నడ ప్రాజెక్ట్ మార్క్. విజయ్ కార్తికేయ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం. ఓ ఇంటర్వ్యూలో లెవన్ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని షేర్ చేశాడు నవీన్ చంద్ర.
లెవన్ అమెజాన్ ప్రైం వీడియోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఊహించని విషయం జరిగిందన్నాడు. లెవన్ మూవీ ఓటీటీలో విడుదలైన తర్వాత జనాలు తనపై అమితమైన ప్రేమ చూపించారని అన్నాడు నవీన్ చంద్ర. ఈ ఇన్వెస్టిగేవ్ థ్రిల్లర్‌ను థియేటర్లలో చూడలేకపోయినందుకు కొందరు విచారం వ్యక్తం చేస్తూ తనకు టికెట్ డబ్బులు కూడా పంపారన్నాడు నవీన్ చంద్ర.
లోకేశ్ అజిల్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రెయా హరి, శశాంక్, అభిరామి, దిలీపన్, రిత్విక, రవి వర్మ, కిరీటి దామరాజు కీలక పాత్రల్లో నటించారు. వరుస హత్యలు చేస్తున్న హంతకుడిని పట్టుకునే నేపథ్యంలో సాగే స్టోరీలో హంతకుడిని పట్టుకునే పోలీసాఫీసర్ పాత్రలో నవీన్ చంద్ర కనిపిస్తాడు. ట్విస్టులు, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో నడిచే లెవన్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి.
Rajamouli | ‘అవతార్ 3’ ప్రమోషన్స్- రాజమౌళితో జేమ్స్ కామెరాన్ స్పెషల్ ఇంటర్వ్యూ.. వీడియో వైరల్
Kaantha | కాంత చిత్రానికి థియేటర్లలో ఫ్లాప్ టాక్.. కానీ ఓటీటీలో ఇంప్రెసివ్ రెస్పాన్స్
Tamannaah | క్రేజీ లైనప్.. మరో బాలీవుడ్ ప్రాజెక్టులో తమన్నా