అమరావతి : ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ( Software Employee ) ఒకరు మరణించారు. గుడిపాల మండలం రామాపురం గ్రామానికి చెందిన అనుదీఫ్ కారులో వెళ్తుండగా పట్టణంలోని ఇరువరంలో కంటైనర్ కారుపై పడింది. దీంతో సాఫ్ట్వేర్ ఉద్యోగి అనుదీప్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతదేహాన్ని కారులో నుంచి తీసేందుకు నానా తంటాలు పడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.